Flag Bearer in Olympics : ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో పతాకధారిగా హాకీ సీనియ‌ర్ గోల్‌కీప‌ర్‌ శ్రీజేశ్‌..

ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా యువ షూటర్‌ మనూభాకర్‌ వ్యవహరించనున్నారు.

ఇప్పుడు ఆమెతోపాటు హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌కు కూడా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్‌ సంఘం ప్రకటించింది. క్రీడాకారుల అభీష్టం మేరకు శ్రీజేశ్‌ను కూడా పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు. శ్రీ‌జేశ్ త‌న క్రీడా జీవితంలో త‌న క్రీడ అయిన హాకీకి, క్రీడ‌ల‌కు ఎంతో సేవ‌లందించారు.

Paris Olympics: ముగిసిన ఒలింపిక్స్.. ఎక్కువ‌ పతకాలు సాధించిన దేశాలివే! 2028 ఒలింపిక్స్ ఎక్క‌డంటే..

ఈ నేపథ్యంలో త‌నను ప‌తాక‌ధారిగా ఎంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని వ్య‌క్తం చేశారు. అలాగే, జావెలిన్ త్రో క్రీడాకారుడైన నీర‌జ్ ఛోప్రా స‌ముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు, ఎవ్వ‌రు అడ‌గ‌క‌పోయినా త‌ను శ్రీ‌జేశ్ పేరునే ప్ర‌క‌టించేవాడిన‌ని చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌జేశ్ త‌న క్రీడాజీవితానికి వీడ్కోలు ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. త‌న విజ‌యానికి అంద‌రి నుంచి అరుదైన గౌర‌వం ల‌భించింది.
 

#Tags