Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టు ఇదే.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు.

16 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌.. వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ సింగ్‌ వ్యవహరిస్తారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. 

గ్రూప్‌ ‘బి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌ జట్లతో భారత్‌ ఆడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. గోల్‌కీపర్‌ శ్రీజేశ్, మిడ్‌  ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ వరుసగా నాలుగో ఒలింపిక్స్‌ ఆడనున్నారు. 
 
భారత హాకీ జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ సింగ్‌ (వైస్ కెప్టెన్‌), శ్రీజేశ్‌ (గోల్‌  కీపర్‌), జర్మన్‌ప్రీత్‌ సింగ్, అమిత్‌ రోహిదాస్, సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్, షంషేర్‌ సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, వివేక్‌ ప్రసాద్, అభిషేక్, సుఖ్‌జీత్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్, మన్‌దీప్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, క్రెయిగ్‌ ఫుల్టన్‌ (హెడ్‌ కోచ్‌).

Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షాట్‌గన్‌ జట్టు ఇదే..

#Tags