Gareth Southgate: పుట్‌బాల్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేసిన సౌత్‌గేట్‌!

గత ఎనిమిదేళ్లుగా ఇంగ్లండ్ పుట్‌బాల్ జట్టుకు శిక్షణ ఇస్తున్న గ్యారెత్ సౌత్‌గేట్ తన పదవికి రాజీనామా చేశారు.

యూరో కప్ ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో 1-2 ఓటమితో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో జట్టు బాధ్యతలు చేపట్టిన సౌత్‌గేట్ నాయకత్వంలో ఇంగ్లండ్ రాటుదేలింది. 2018 ఫిఫా ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడంతో పాటు 2021, 2024 యూరో టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది.

"మార్పు కోసం సమయం ఆసన్నమైంది. కొత్త అధ్యాయానికి తెర లేవనుంది" అని 52 ఏళ్ల సౌత్‌గేట్ రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇంగ్లాండ్ సాధించిన విజయాలు ఇవే..
2018 ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్
2020 యూరో ఛాంపియన్‌షిప్ రన్నరప్
2024 యూరో ఛాంపియన్‌షిప్ రన్నరప్
2018-19 యుఈఎఫ్ఏ(UEFA) నేషన్స్ లీగ్ సెమీఫైనల్
2021-23 యుఈఎఫ్ఏ(UEFA) నేషన్స్ లీగ్ సెమీఫైనల్

Wimbledon 2024: వరుసగా రెండో ఏడాది వింబుల్డన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న అల్కరాజ్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..

#Tags