Arjuna Awards 2023: అర్జున అవార్డు అందుకున్న షమీ.. ఎంత మంది క్రీడాకారులు ఈ అవార్డు తీసుకున్నారంటే..?

ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం జనవరి 9న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడలలో ప్రభుత్వం అందజేసే రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును అందుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో అద్భుత ప్రదర్శన (7 మ్యాచ్‌ల్లో 3 ఐదు వికెట్ల ఘనతలతో 24 వికెట్లు) కారణంగా షమీ అర్జున్ అవార్డుకు ఎంపికయ్యాడు. షమీతో పాటు వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి. 
గతేడాది బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన చిరాగ్‌ చంద్రశేఖర్‌ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌లకు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. అవార్డు అందుకున్న వారిలో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ అర్జున ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ ఈ అవార్డును అందుకోలేకపోయింది.

Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్‌లాండ్‌ ‘అన్వేషణ’ అవార్డ్‌

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి హ‌జరు కాలేదు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్‌ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్‌.వైశాలి, రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్, అథ్లెట్‌ పారుల్‌ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెప్టెన్, తెలుగు టైటాన్స్‌ జట్టు స్టార్‌ ప్లేయర్‌ పవన్‌ కుమార్‌ సెహ్రావత్‌ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.

పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి, వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్‌ కనోయిస్ట్‌ ప్రాచీ యాదవ్‌ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా.. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్‌ మోతుకూరి తులసీ చైతన్య టెన్‌జింగ్‌ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు.

విజయవాడ సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్‌ జలసంధి, పాక్‌ జలసంధి, ఇంగ్లిష్‌ చానెల్, నార్త్‌ చానెల్‌లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్‌ రత్న’, 26 మందికి ‘అర్జున’, ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్‌ అవార్డు, ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్‌, ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌’ అవార్డులు ప్రకటించారు.

French Civilian Award: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు ఫ్రెంచ్‌ పురస్కారం

ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. కాగా.. ప్రస్తుత భారత క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌ (2021), రవీంద్ర జడేజా (2019), రోహిత్‌ శర్మ (2015), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2014), విరాట్‌ కోహ్లి (2013) అర్జున అవార్డులు గెలుచుకున్నారు.

అర్జున అవార్డు అందుకున్న వారు వీరే..

Athletes

Discipline

Ms Aditi Gopichand Swami

Archery

Shri Ojas Pravin Deotale

Archery

Shri Sreeshankar Murali

Athletics

Ms Parul Chaudhary

Athletics

Shri Mohameed Hussamuddin

Boxing

Ms R Vaishali

Chess

Shri Mohammed Shami

Cricket

Shri Anush Agarwalla

Equestrian

Ms Divyakriti Singh

Equestrian Dressage

Ms Diksha Dagar

Golf

Shri Krishan Bahadur Pathak

Hockey

Ms Pukhrambam Sushila Chanu

Hockey

Shri Pawan Kumar

Kabaddi

Ms Ritu Negi

Kabaddi

Ms Nasreen

Kho-Kho

Ms Pinki

Lawn Bowls

Shri Aishwary Pratap Singh Tomar

Shooting

Ms Esha Singh

Shooting

Shri Harinder Pal Singh Sandhu

Squash

Ms Ayhika Mukherjee

Table Tennis

Shri Sunil Kumar

Wrestling

Ms Antim Panghal

Wrestling

Ms Naorem Roshibina Devi

Wushu

Ms Sheetal Devi

Para Archery

Shri Illuri Ajay Kumar Reddy

Blind Cricket

Para Canoeing

Ms Prachi Yadav

#Tags