Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే హైదరాబాద్‌ అమ్మాయిలు వీరే..

ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ వేదికపై మరోసారి హైదరాబాదీ అమ్మాయిలు దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నారు.

పారిస్‌లో జరగనున్న 2024 ఒలింపిక్‌ పోటీలు జూలై 26వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ భారత క్రీడాకారుల బృందంలో 47 మంది మహిళా అథ్లెట్లు ఉండగా.. అందులో నలుగురు హైదరాబాదీలే ఉన్నారు. 

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిని శ్రీజ
ముఖ్యంగా ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటి వరకు టేబుల్‌ టెన్నిస్‌లో పతకం సాధించలేదు. అయితే ఈసారి హైదరాబాద్‌ నుంచి ఒలింపిక్స్‌ వెళ్లిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిని శ్రీజ ఆకులపై అంచనాలు పెరిగాయి. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో శ్రీజ ఆకుల, శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం 2016, 2020 ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలను సాధించిపెట్టి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పీవీ సింధు కచ్చితంగా పతకంతోనే తిరిగొస్తుందని దేశమంతా దీమాగా ఉంది.

అథ్లెట్‌ నిఖత్‌ జరీన్‌..
రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ నెగ్గిన మరో అథ్లెట్‌ నిఖత్‌ జరీన్‌ భారతీయ బృందంలో స్టార్‌ ప్లేయర్‌గా పారిస్‌ వెళ్లింది. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఇదే ఏడాది ఏషియన్‌ గేమ్స్‌లోనూ కాంస్యం సాధించింది.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులు వీరే..

13 ఏళ్ల వయస్సులో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ కేటగిరిలో నేషనల్‌ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌పై కూడా భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ఏషియన్‌గేమ్స్‌లో రజత పతకంతో రాణించిన ఇషా ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని ఖాయం చేస్తుందని క్రీడా ప్రముఖులు అభిలాస్తున్నారు. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో మాజీ ఒలింపిక్స్‌ పతక విజేత, హైదరాబాదీ పీవీ సింధూనే ఫ్లాగ్‌ బేరర్స్‌గా ఇండియన్‌ ఒలింపిక్‌ కమిటీ ప్రకటించింది.

#Tags