Asian Games Shooting: ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు

గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు.
Asian Games Shooting

ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో సిఫ్ట్‌ కౌర్‌ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్‌ కౌర్‌ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

Asian Games Rifle: రైఫిల్‌లో భారత్‌కు రజతం

467 పాయింట్లతో బ్రిటన్‌ షూటర్‌ సియోనైడ్‌ మెకింటోష్‌ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్‌ కౌర్‌ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్‌లో భారత్‌కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్‌ కియోంగ్‌యు జాంగ్‌ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్‌ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది.
అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్‌ సాంగ్వాన్, మనూ భాకర్‌ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్‌లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్‌ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్‌కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్‌ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.  

Asian Games 2023: భారత యువ షూటర్ల‌కు స్య‌ర్ణం

పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో భారత్‌కు టీమ్‌ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్‌ జీత్‌ సింగ్, గురుజోత్‌ సింగ్, అంగద్‌ వీర్‌సింగ్‌ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్‌లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్‌ జీత్‌ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. 

Asian Games Equestrian: ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు స్వర్ణం

 

#Tags