Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ..

హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అద్భుతమైన సెంచరీతో అభిషేక్ శర్మ అందరినీ ఆకట్టుకున్నాడు.

టీమిండియా యువ ఓపెనర్ తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఈ ఘన విజయంతో పాటు అతను అనేక చారిత్రక రికార్డులను సృష్టించాడు.

➣ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేశాడు. అభిషేక్ కేవలం 2 ఇన్నింగ్స్‌లలోనే సెంచరీ చేసి, ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో, మునుపటి రికార్డు కలిగి ఉన్న దీపక్ హుడా (3 ఇన్నింగ్స్) రికార్డును అధిగమించాడు.

➣ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్సు కలిగిన ఆటగాడు.  23 ఏళ్ల 307 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు.

➣ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ అభిషేక్.  47 బంతుల్లో సెంచరీ చేసి, ఈ జాబితాలో రోహిత్ శర్మ (38 బంతులు), సూర్యకుమార్ యాదవ్ (45 బంతులు), కేఎల్ రాహుల్ (46 బంతులు) తర్వాత స్థానం సంపాదించాడు.

➣ ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు.. 18 టీ20 మ్యాచ్‌ల్లో 50 సిక్స్‌లు బాదిన అభిషేక్, ఈ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మునుపటి రికార్డు ధారకుడు రోహిత్ శర్మ (25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు).

T20 World Cup: టి20 ప్రపంచకప్‌ విజేత భార‌త్‌.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

#Tags