Nuclear Reactors: భార‌త్‌లో కొత్తగా 10 అణు విద్యుత్ కేంద్రాలు

భార‌త‌దేశంలో కొత్తగా పది అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది.

అక్టోబ‌ర్ 21వ తేదీ శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సంబంధ పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీలో ఈ వివరాలను సభ్యులకు అందజేసింది.  

ఈ కేంద్రాలను 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో గుజరాత్, రాజస్తాన్, హరియాణాలో ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్‌లోని కాక్రపార్‌లో రెండు అణు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది.

కానీ, ఈ ప్రాజెక్టుల నిర్మాణం చాలా ఆలస్యంగా జరుగుతోందని కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2007లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతున్నట్లు అభిప్రాయపడుతూ, ఆయన ‘సుప్రీం నేత’ కనుసన్నల్లో అభివృద్ధి వేగానికి ఇది ఒక నిదర్శనం అని వ్యంగ్యంగా చెప్పారు. కాక్రపార్–3, కాక్రపార్–4 రియాక్టర్లు కాంగ్రెస్ హయాంలోనే ఆమోదం పొందిన విషయాన్ని ఆయన గుర్తించారు.

Climate Change: గతి తప్పుతున్న రుతుపవనాలు.. దీనికి కారణం ఇదే..

#Tags