VL-SRSAM: స్వల్పశ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి (వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం)ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్.. హైస్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు. ‘డీఆర్డీవో, భారత నావికాదళం కలిసి.. వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎంను విజయవంతంగా పరీక్షించాయి. యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే ఈ క్షిపణి.. రాడార్‌కు దొరకకుండా సీ–స్కిమ్మింగ్ సాంకేతికతతో దూసుకొచ్చే లక్ష్యాలతోపాటు సమీప పరిధిలోని వివిధ వైమానిక టార్గెట్‌లను కూల్చివేస్తుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags