Gaganyaan Mission: గగన్‌యాన్‌ వ్యోమగాములు వీళ్లే.. జాతికి పరిచయం చేసిన మోదీ

అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

మిషన్‌లో పాల్గొని రోదసిలోకి వెళ్లున్న నలుగురు భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అంగద్‌ ప్రతాప్, అజిత్‌ కృష్ణన్, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. 

వీరు నలుగురూ భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌ పైలట్లే. కేరళలోని తుంబలో ఉన్న విక్రమ్‌ సారాబాయ్‌ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ‘ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌’ను మోదీ ప్రదానం చేశారు. అనంతరం భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దేశ అమృత తరానికి వారు అత్యుత్తమ ప్రతినిధులంటూ ప్రశంసించారు. ‘ఈ నలుగురు వ్యోమగాముల పేర్లు భారత విజయగాథలో శాశ్వతంగా నిలిచిపోతాయి. నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కలను వారు నిజం చేయనున్నారు’ అంటూ కొనియాడారు. ‘వీళ్లు కేవలం నలుగురు వ్యక్తులో, నాలుగు పేర్లో కాదు. 140 కోట్ల మంది భారతీయుల కలలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు!’ అన్నారు.

గగన్‌యాన్‌ మిషన్‌ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుని మేకిన్‌ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ హర్షం వెలిబుచ్చారు. ఏ విధంగా చూసినా ఇది చరిత్రాత్మక మిషన్‌ అని చెప్పారు. ‘గతంలో భారతీయ వ్యోమగామి వేరే దేశం నుంచి విదేశీ రాకెట్‌లో రోదసీలోకి వెళ్లొచ్చారు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌ అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. ఈసారి టైమింగ్, కౌంట్‌డౌన్, రాకెట్‌తో సహా అన్నీ మనం స్వయంగా రూపొందించుకున్నవే. గగన్‌యాన్‌ మిషన్‌లో వినియోగిస్తున్న ఉపకరణాల్లో అత్యధికం భారత్‌లో తయారైనవే. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధిస్తున్న స్వావలంబనకు తార్కాణమిది’ అన్నారు. ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి దేశీయ రాకెట్‌లో చంద్రునిపై దిగడం ఖాయమని జోస్యం చెప్పారు. 

మిషన్ పేరు: గగన్‌యాన్

మిషన్ లక్ష్యం: ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్ష్యలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావడం

మిషన్ ఖర్చు: రూ.10 వేల కోట్లు

ఎంపికైన వ్యోమగాములు:

  • గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్
  • అంగద్‌ ప్రతాప్
  • అజిత్‌ కృష్ణన్
  • వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా

మిషన్ ప్రారంభం: 2025

మిషన్ ప్రత్యేకతలు:

  • భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర
  • దేశీయంగా రూపుదిద్దుకున్న మిషన్
  • అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలవనుంది

Amrit Bharat Stations: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవే..

భారత అంతరిక్ష శక్తిగా ఎదుగుతున్న తీరు
ప్రధాన మంత్రి మోదీ భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తూ, 21వ శతాబ్దిలో మనం ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇస్రో సాధించిన ఘన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కొన్ని ముఖ్య విషయాలు:

  • అరుణగ్రహం చేరిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.
  • ఒకే మిషన్‌లో 100కు పైగా ఉపగ్రహాలను రోదసిలోకి పంపిన ఘనత సాధించింది.
  • చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది.
  • ఆదిత్య ఎల్‌1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

భవిష్యత్తు అవకాశాలు:

  • ఈ విజయాలతో భారత్ అంతరిక్ష రంగంలో ప్రపంచ వాణిజ్య హబ్‌గా మారే అవకాశం ఉంది.
  • రానున్న పదేళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఐదింతలు పెరిగి 44 బిలియన్‌ డాలర్లకు చేరే అంచనా.

మహిళా శక్తి:

  • ఇస్రో అంతరిక్ష మిషన్లలో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
  • చంద్రయాన్‌ మొదలు గగన్‌యాన్‌ దాకా ఏ ప్రాజెక్టునూ మహిళా శక్తి లేకుండా ఊహించుకోలేని పరిస్థితి ఉంది.
  • 500 మందికి పైగా మహిళలు ఇస్రోలో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు.

గగన్‌యాన్‌ మిషన్:

  • నలుగురు వ్యోమగాములు అత్యంత కఠినమైన శిక్షణ పొందారు.
  • 2025లో ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది లక్ష్యం.
  • ఇది విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.

హ్యూమనాయిడ్‌ రోబో వ్యోమమిత్ర:

మానవసహిత యాత్రకు ముందు గగన్‌యాన్‌లో భాగంగా రోదసిలోకి వెళ్లనున్న హ్యూమనాయిడ్‌ రోబో వ్యోమమిత్రతో ప్రధాన మంత్రి మోదీ సంభాషించారు.

గగన్‌యాన్‌ మిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం లేకపోవడం:

  • ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిషన్లకు టెస్ట్‌ పైలట్ల పూల్‌ నుంచి మాత్రమే వ్యోమగాముల ఎంపిక జరుగుతుంది.
  • భారత టెస్ట్‌ పైలట్ల పూల్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం వల్ల గగన్‌యాన్‌ మిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం లేదు

Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి రానున్న‌ కొత్త క్రిమినల్​ చట్టాలు

#Tags