Super Large Warhead: వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా జులై 1వ తేదీ హువాసంగ్‌ఫొ–11 డీఏ–4.5 అనే వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని, అది అతిపెద్ద వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని ప్రకటించింది.

ఈ క్షిపణి గరిష్టంగా 500 కిలోమీటర్లు, కనిష్టంగా 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని, దీనికి 4.5 టన్నుల బరువున్న వార్‌హెడ్ అమర్చబడిందని అధికారులు తెలిపారు.

అయితే.. దక్షిణ కొరియా సైన్యం జులై 1వ తేదీ ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపంలోని నిర్జన ప్రాంతంలో కుప్పకూలిందని జులై 2వ తేదీ తెలిపింది.

ఈ క్షిపణి ప్రయోగం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించిందని, కొరియా ద్వీపకల్పం, ఈ ప్రాంతంలోని శాంతి, స్థిరత్వానికి ముప్పుగా ఉందని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఖండించాయి.

NISAR Mission: హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ప్రయత్నం!

#Tags