Cancer: క్యాన్సర్‌పై పోరుకు కొత్త అస్త్రం
క్యాన్సర్‌పై సమర్థంగా పోరాడే వినూత్న ఇమ్యునోథెరపీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వైద్యకళాశాల పరిశోధకులు రూపొందిస్తున్న కొత్త చికిత్సా విధానంలో నేచురల్ కిల్లర్(ఎన్ .కె.) కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతవరకూ క్యాన్సర్‌పై పోరుకు ఉపయోగిస్తున్న టి కణాల కంటే ఈ ఎన్ .కె.కణాలే శక్తిమంతమైనవని శాస్త్రవేత్తలు తేల్చారు. క్యాన్సర్ కణాల్లోని పీవీఆర్ అనే ప్రోటీన్ టీ, ఎన్ .కె.కణాలు క్యాన్సర్‌ను నిర్మూలించకుండా అడ్డుపడుతోంది. ఎన్ .కె.కణాల్లోని కేఐఆర్2డీఎల్5 అనే పదార్థానికి పీవీఆర్ అతుక్కోవడంతో ఆ కణాలు నిర్వీర్యమవుతున్నాయి. దీంతో కేఐఆర్2డీఎల్5, పీవీఆర్‌ల బంధాన్ని ఛేదించే మోనోక్లోనల్ యాంటీబాడీని పరిశోధకులు కనిపెట్టారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags