NASA: చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా
ఆర్టెమిస్ 3 యాత్ర ద్వారా చంద్రునిపైకి మళ్లీ వ్యోమగాములను పంపే ప్రణాళికను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సిద్ధం చేస్తోంది. దీంతోపాటు మరో పెద్ద సవాలును స్వీకరించబోతోంది. చంద్రుని ఉపరితలంపై డక్‌వీడ్, క్రెస్, బ్రాసికా(ఆవ) మొక్కలను పెంచడమే ఆ సవాలు. 2026లో జాబిల్లిపై నాసా నిర్వహించ తలపెట్టిన మూడు ప్రయోగాల్లో ‘లీఫ్’(లూనార్ ఎఫెక్టస్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా) ఒకటి. చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోని పరిస్థితులను మొక్కలు ఎలా తట్టుకోగలుగుతాయో తెలుసుకునేందుకు కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీస్ సంస్థ ‘లీఫ్’ ప్రయోగాన్ని డిజైన్ చేసింది. దీనిలో భాగంగా వ్యోమగాములు థేల్‌క్రెస్, డక్‌వీడ్ లేదా రెడ్ అండ్ గ్రీన్ బ్రాసికా(దీన్ని ర్యాప్‌సీడ్ లేదా విస్కాన్సిన్ ఫాస్ట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు) శాంపిళ్లతో కూడిన ‘గ్రోత్ చాంబర్స్’ను చంద్రుని ఉపరితలంపై నెలకొల్పుతారు. ఈ క్యాప్సూళ్లు అధిక రేడియేషన్, సూర్యకాంతి, అంతరిక్ష శూన్యత నుంచి మొక్కలకు రక్షణ కల్పించడంతోపాటు వాటి పెరుగుదలను వ్యోమగాములు పర్యవేక్షించేందుకు వీలు కల్పిస్తాయి.
చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP