ISRO: డిసెంబర్‌లో రెండు ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్‌లో సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రెండు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలను చేపట్టనున్నది.

డిసెంబర్ 4వ తేదీ పీఎస్‌ఎల్‌వీ సీ59, 24న పీఎస్‌ఎల్‌వీ సీ60 రెండో రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. 

షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి మొబైల్ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)లో పీఎస్‌ఎల్‌వీ సీ59, పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ బిల్డింగ్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

డిసెంబర్ 4వ తేదీ.. పీఎస్‌ఎల్‌వీ సీ59 రాకెట్‌ ద్వారా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోభా–3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న తరహా ఉపగ్ర­హాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు.

డిసెంబర్ 24వ తేదీ.. పీఎస్‌ఎల్‌వీ సీ60 ద్వారా రిశాట్‌–1బి అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Intercontinental Ballistic Missile: ఖండాంతర క్షిపణి ఏమిటో తెలుసా..? తొలుత కనిపెట్టిన దేశం ఇదే..

#Tags