Private Launchpad: దేశంలో తొలి ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్‌

తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌–షార్‌ క్యాంపస్‌లో ఇస్రో ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్, మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నవంబర్‌ 25న ప్రారంభించినట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు.

అంతరి క్షయానం ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనే ఉద్దేశం ఈ ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్‌తో సాకార మవుతుందన్నారు. అగ్నికుల్‌ (భారత అంతరిక్ష–టెక్‌ స్టార్ట్‌అప్‌) అనే ప్రైవేట్‌ కంపెనీ ఈ లాంచ్‌ ప్యాడ్‌ను డిజైన్‌ చేసినట్లు వివరించారు. అలాగే, అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా షార్‌లో ప్రారంభించినట్లు చెప్పారు. 

PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

#Tags