Ericsson Mobility Report: 5జీ వినియోగదారులపై ఎరిక్‌సన్‌ నివేదిక.. భారత్‌లో 6జీ సేవల ప్రారంభం.. ఎప్పుడంటే..

భారతదేశంలో 2030 నాటికి 5జీ వినియోగదారుల సంఖ్య మూడు రెట్లు వృద్ధి చెంది 97 కోట్లకు చేరుతుందని నెట్‌వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్‌ దిగ్గజం ఎరిక్సన్‌ రూపొందించిన కంజ్యూమర్‌ల్యాబ్‌ రిసర్చ్‌ నివేదిక వెల్లడించింది.

ఆ సమయానికి మొత్తం మొబైల్‌ కస్టమర్లలో 5జీ యూజర్ల వాటా ఏకంగా 74 శాతానికి ఎగబాకుతుందని తెలిపింది. 

ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ ప్రకారం.. 2024 చివరికి భారత్‌లో 5G సబ్‌స్క్రిప్షన్‌లు 27 కోట్లు దాటవచ్చని అంచనా. ఇది దేశంలో మొత్తం మొబైల్‌ కస్టమర్లలో 23 శాతం. అంతర్జాతీయంగా 2023 చివరిలో 5జీ చందాదారుల సంఖ్య దాదాపు 230 కోట్లకు చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 5G సబ్‌స్క్రిప్షన్లలో 25 శాతం వాటా ఉంటుంది. 2030 నాటికి, ప్రపంచంలో 630 కోట్ల మంది 5జీ మొబైల్ సేవలను ఉపయోగిస్తారని అంచనా వేయబడింది.  

Ballistic Missile: ఉక్రెయిన్‌పైకి ఖండాంత‌ర క్షిప‌ణి.. ఇదే తొలిసారి..!
 
2027 నాటికి 4జీని దాటి.. 

5జీ వినియోగదార్ల సంఖ్య 2027లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4జీ సబ్‌స్క్రిప్షన్లను అధిగమిస్తాయని అంచనా. మొదటిసారిగా 6జీ సేవలు 2030లో ప్రారంభం కావొచ్చు. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు మెరుగైన పనితీరు కోసం వీడియో కాలింగ్, స్ట్రీమింగ్, ఆన్‌లైన్‌ చెల్లింపులకు అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

5జీ వినియోగదార్లలో ఆరుగురిలో ఒకరు తమ ప్రస్తుత నెలవారీ మొబైల్‌ ఖర్చులో 20 శాతం ఎక్కువ చెల్లించడానికి రెడీగా ఉన్నారని ఎరిక్సన్‌ ఆగ్నేయాసియా, భారత్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ హెడ్‌ ఉమాంగ్‌ జిందాల్‌ తెలిపారు.

జనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (జెన్‌ ఏఐ) అప్లికేషన్లు 5జీ పనితీరును నడిపించే కీలక సాధనాలుగా ఉద్భవించాయి. జెన్‌ ఏఐ యాప్‌లను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో పెరుగుతుంది. భారత్‌లోని 5జీ స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లలో 67 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ప్రతీ వారం జెన్‌ ఏఐ యాప్‌లను ఉపయోగిస్తారని నివేదిక వివరించింది.

ISRO-SpaceX: స్పేస్‌ ఎక్స్‌తో ఇస్రో తొలి ప్రయోగం విజయవంతం

#Tags