Sunita Williams: విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకున్న సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్తో కలిసి జూన్ 5వ తేదీ ప్రారంభించిన అంతరిక్ష ప్రయాణంలో విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకున్నారు.

జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 1.34 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి అడుగుపెట్టారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారి ప్రయాణం జరిగింది.

అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఏడుగురు వ్యోమగాములు ఉండగా, సునీత మరియు బుచ్‌ రాకతో వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. ఆలింగనాలు, నృత్యాలు సహా ఆనందోత్సవాలు జరిగాయి. 

 

 

"ఐఎస్‌ఎస్‌ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న డ్యాన్స్‌ పార్టీ ఏర్పాటు చేశాముష‌ అన్నారు. ఈ వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

Sunita Williams:  మూడోసారి అంతరిక్షంలోకి.. సునీతా విలియమ్స్ 

#Tags