Sunita Williams: స్పేస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌.. ఆమెకు వచ్చే అనారోగ్య సమస్యలు?

ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా.. స్పేస్ టూర్‌కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 78 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు.

జూన్ 5వ తేదీన అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోరీతో కలిసి.. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, నిజానికి జూన్ 14వ తేదీనే భూమ్మీదకి తిరిగి రావాల్సి ఉంది. వారు వెళ్లిన స్టార్ లైనర్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా అన్ని రోజులు ఉండిపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది..?

అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కళ్లు, హృదయనాళ వ్యవస్థ, ఎముకల సాంద్రత, అభిజ్ఞా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకశాం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యోమగాముల డీఎన్‌ఏ ముప్పు గురించి మాట్లాడుతున్నారు. స్పేస్‌ రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి అయ్యితే ఎర్ర రక్త కణాలు నాశనమయ్యిపోతాయని చెబుతున్నారు. అంతరిక్షం శరీరంలోని ఎర్ర రక్తకణాలను సెకనుకు మూడు మిలియన్లు చొప్పున నాశనం చేస్తుందట. అంటే ఆరు నెలల అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల శరీరాలు సెకనుకు మూడు మిలియన్లు ఎర్రరక్తకణాలను కోల్పోతుందట. 

Gaganyaan: అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్‌.. అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయడు ఈయ‌నే..

అదే భూమ్మీద సెకను రెండు మిలియన్ల ఎర్ర రక్తకణాలను సృష్టించి, నాశనం చేస్తుందట. అలాగే శరీర ద్రవాల మార్పులు, ఆర్‌బీసీలలో మార్పులు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల వ్యోమగాములు తమ రక్తనాళాలలో 10% వరకు ద్రవాన్ని కోల్పోతారు. వ్యోమగాములు అతరిక్షంలో ఉన్నంతకాలం ఎర్ర రక్తకణాల నాశనం లేదా హిమోలిసిస్‌ జరుగుతూనే ఉంటుంది. 

అంతేగాక 1998 నుంచి 2001 జరిపిన అధ్యయనంలో 13 రోజుల మిషన్‌కు వెళ్లిన 14 మంది వ్యోమగాములు రక్త నమునాలను నాసా విశ్లేసించింది. ప్రయోగానికి పది రోజుల ముందు తీసుకున్న రక్త నమునాలతో మిషన్‌ ల్యాండింగ్‌ అయిన తర్వాత సేకరించిన రక్త నమునాలలోని తేడాలను గుర్తించినట్లు తెలిపారు. 

ల్యాండింగ్‌ అయిన మూడు రోజుల తర్వాత ఫ్రీ-ఫ్లోటింగ్ మైటోకాన్డ్రియల్ డీఎన్‌ఏ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఇది స్పేస్‌ ప్రయాణానికి ముందు కంటే 355 రెట్లు ఎక్కువని అన్నారు. అందువల్ల డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ప్రమాదకరమని చెప్పారు వైద్యులు. దీనిపై మరింతగా పరిశోధనలు చేస్తే మిషన్‌ వెళ్లే ముందు, తదనంతరం ఎదురయ్యే ఒత్తిడి, వాపుల నుంచి వ్యోమగాములను రక్షించగలమా..? లేదా? అనేది తెలుస్తుంది.

Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఈ సమస్యలే కారణం!!

#Tags