Bharat GPT: భారత్ జీపీటీ ‘హనుమాన్’
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఒకటి. ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా ‘హనుమాన్’ పేరుతో సీతా మహలక్షి్మ హెల్త్‌కేర్(ఎస్‌ఎంఎల్) సంస్థ ఓ లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం)ను ఆవిష్కరించింది. ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ ఎల్‌ఎల్‌ఎంను బాంబే ఐఐటీ నేతృత్వంలోని భారత్ జీపీటీ ఎకోసిస్టం భాగస్వామ్యంతో ఆవిష్కరించారు. బాంబే ఐఐటీతోపాటు మరో 7 ఇతర ఐఐటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ జీపీటీ ఎకోసిస్టం వాస్తవానికి ఓ రిసెర్చ్ కన్సార్షియం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం, ఎస్‌ఎంఎల్ తోడ్పాటుతో ముందుకు సాగుతోంది ఈ కన్సార్షియం. స్పీచ్ టు–టెక్స్, టెక్స్ టు–స్పీచ్, టెక్స్ టు–వీడియో, వీడియో –టు–టెక్స్ జనరేటింగ్ లాంటి బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న ‘హనుమాన్’ ఎల్‌ఎల్‌ఎం.. ప్రస్తుతానికి హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తోంది. మున్ముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP