Aditya L1 Mission Launch Live updates: ఆదిత్య–ఎల్‌1 ప్ర‌యోగం విజ‌య‌వంతం

సూర్యుడిపై పరిశోధనల కోసం సెప్టెంబర్‌ 2వ తేదీన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) శ్రీహరికోట నుంచి ఉదయం 11.50 గంటలకు PSLV-C57 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో స్పష్టం చేసింది.
Aditya L1

 

ఆదిత్య – ఎల్‌1 లైవ్ అప్డేట్స్
 

  • విజ‌య‌వంతంగా నిర్దేశిత క‌క్ష‌లోకి అడుగుపెట్టిన ఆదిత్య–ఎల్‌1
  • నాల్గవ ద‌శ‌లో సాధార‌ణ స్దితిలో ప్ర‌యానిస్తున్న ఆదిత్య–ఎల్‌1 
  • మూడ‌వ ద‌శ‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ఆదిత్య–ఎల్‌1
  • రెండవ ద‌శ‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ఆదిత్య–ఎల్‌1
  • మెద‌టి ద‌శ‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ఆదిత్య–ఎల్‌1
  • ఆదిత్య–ఎల్‌1ని నింగిలోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టిన ఇస్రో
  • ఆదిత్య–ఎల్‌1ని చూసేందుకు శ్రీ హ‌రి కోట లాంచింగ్ స్టేష‌న్ కు భారీగా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు.

రాకెట్‌ వివరాలు

  •  పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ పొడవు 44.4 మీటర్లు.
  •  రాకెట్‌ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది.
  • మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్‌ అలోన్‌ దశ, ఈ ప్రయోగానికి రాకెట్‌ చుట్టూరా ఆరు స్ట్రాపాన్‌ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు.  
  • 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది.
  • 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ  పూర్తవుతుంది.
  • 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు.
  • మళ్లీ నాలుగోదశ (పీఎస్‌–4) 3127.52 సెకన్లకు స్టార్ట్‌ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్‌ చేస్తారు.  
  • శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్‌ ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు.  175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్‌ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు.

కాగా, గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు.

High temperature on Moon: చంద్రుడిపై అధిక‌ ఉష్ణోగ్రతలు

సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది?

  • ఆదిత్య–ఎల్‌1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది.  
  • సౌర అతినీలలోహిత ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌) అనే పేలోడ్‌ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్‌ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్‌ చిత్రాలను అందిస్తుంది.  
  • ఆదిత్య సోలార్‌ విండ్‌ పారి్టకల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (యాస్‌పెక్స్‌) అనే పేలోడ్‌ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది.  
  • ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది.  
  • సోలార్‌ ఎనర్జీ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్‌) సోలార్‌ కరోనా సమస్యాత్మకమైన కరోనల్‌ హీటింగ్‌ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్‌–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది.
  • హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ (హెలియోస్‌) సౌర కరోనాలో డైనమిక్‌ ఈవెంట్‌లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది.  
  • మ్యాగ్‌ అనే ఈ పేలోడ్‌ను  ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది.

ఆదిత్య–ఎల్‌1లో పేలోడ్స్‌ ఇవే..

సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్‌ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్‌ బిందువు–1 (ఎల్‌–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్‌ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్‌) ఉంటాయి.

Aditya L1 Mission: సెప్టెంబర్‌ 2న ఆదిత్య–ఎల్‌1

బెంగళూరులోని ఫ్రొపెసర్‌ యూఆర్‌ రావు స్పేస్‌ సెంటర్‌ (యూఆర్‌ఎస్‌సీ)లో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. యూఆర్‌ఎస్‌సీ సెంటర్‌లో పనిచేస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కే శంకర సుబ్రమణియన్‌  శాటిలైట్‌ సెంటర్‌లో స్పేస్‌ ఆస్ట్రానమీ గ్రూపు (సాగ్‌)కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. శంకర్‌ సుబ్రమణియన్‌ గతంలో ఖగోళ పరిశోధనకు ఉపయోగించిన ఆస్ట్రోశాట్‌ ఆనే ఉపగ్రహాన్ని,  చంద్రయాన్‌–1. చంద్రయాన్‌–2 మిషన్లకు అనేక హోదాల్లో పనిచేశారు. 

ప్రయోగం విశేషాలివే..

 

  • భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్‌ పాయింట్‌–1 (ఎల్‌1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు
  • భూమి నుంచి లాంగ్రేజియన్‌ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది
  • లాంగ్రేజియన్‌1 పాయింట్‌లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు.
  • ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు
  • సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది,  అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్‌1 అధ్యయనం చేస్తుంది.  
  • సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్‌ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్‌ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. 

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి.

Aditya-L1 Mission: ఆదిత్య–ఎల్‌1 ప్ర‌యోగానికి ఏర్పాట్లు పూర్తి

#Tags