T-Fiber: టీ–ఫైబర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు
ఈ వ్యవస్థతో ప్రతి ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ ఆధారిత సేవలు అందుబాటులో రానున్నాయి. డిసెంబర్ 8వ తేదీ హైదరాబాద్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలలో, మంత్రి శ్రీధర్‌బాబు మద్దూరు, సంగంపేట, అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అలాగే పరిశ్రమల శాఖ విడుదల చేసిన కొన్ని యాప్‌లను కూడా మంత్రి ఆవిష్కరించారు.
ఇక 2 రోజుల్లో పంట రుణాలు..
స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్విస్ యాప్ ద్వారా రైతులు 2 రోజుల్లోనే పంట రుణాలను పొందగలుగుతారని, అలాగే వాయిస్ కమాండ్ ద్వారా రైతులు ఎరువులు, క్రిమికీటకాల నివారణ వంటి సూచనలు పొందవచ్చని శ్రీధర్‌బాబు వివరించారు. అలాగే 'మిత్ర-తెలంగాణ' అనే యాప్‌ను తీసుకురావడం ద్వారా నిషేధిత మాదక ద్రవ్యాలు, అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇక యాప్ ద్వారా మీ–సేవ
మీ–సేవ విస్తరణలో భాగంగా.. స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పు, లోకల్ క్యాండిడేట్, మైనారిటీ, ఇన్‌కమ్, క్యాస్ట్, క్రీమీలేయర్/నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లతోపాటు సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ఫిర్యాదులు, వణ్యప్రాణుల దాడిలో మరణించే వ్యక్తులు, పశువులకు నష్టపరిహారం, టింబర్ డిపో/సామిల్స్‌కు పర్మిట్ల జారీ/రెన్యూవల్ కలిపి మొత్తం 9 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు తెలిపారు.
GST Collections: ఏపీలో క్షీణించిన జీఎస్టీ వసూళ్లు! దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో..
అలాగే.. టీ–వర్క్స్–బిట్స్ పిలానీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ(సీఆర్‌ఈఎన్‌ఎస్)ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య అన్వేషణ, అభివృద్ధికి ‘రూరల్ వర్క్స్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.
రూ.7,592 కోట్ల పెట్టుబడులతో..
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు రూ.7,592 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 3 కంపెనీలతో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పరి శ్రమల శాఖ 4 పరస్పర అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఆయా సంస్థల ఏర్పాటుతో 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సౌర విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ‘ప్రీమియర్ ఎనర్జీస్’.. వ్యాపార విస్తరణలో భాగంగా రూ.1,950 కోట్లతో సోలార్ ఇంగాట్స్ అండ్ అల్యూమినియం ప్లాంట్ ఏర్పా టు చేసేందుకు, మరో రూ.3,342 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ సెల్, 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిందని శ్రీధర్‌బాబు అన్నారు.
Maoists: పీఎల్‌జీఏ 24వ వారోత్సవం.. గెరిల్లా వార్ నుంచి పీపుల్స్ ఆర్మీ దిశగా..
అలాగే.. రూ.1,500 కోట్లతో ‘లెన్స్‌కార్ట్’ ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాలు, అనుబంధ ఉత్ప త్తుల తయారీ హబ్‌ను ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేయనుందని వివరించారు. ఆజా ద్ ఇంజనీరింగ్ సంస్థ ఘణపూర్‌లో రూ.800 కోట్లతో సూపర్ అల్లాయ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు.
రాష్ట్రంలో 2,000 ఎకరాల్లో కొత్తగా 12 మినీ ఇండస్ట్రీయల్ పార్కులు 1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.