Aquarium In Hyderabad: హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్‌ ఆక్వేరియం..!

ఐటీ, టూరిజం రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా దూసుకెళ్తోంది.

కాగా ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ అక్వేరియం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. పక్షుల ఆవాస కేంద్రంగానూ ఇది ఆవిర్భవించనుంది. ఈ ఆక్వేరియం త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons in News) క్విజ్ (05-11 మార్చి 2023)

హైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మించే అవకాశాలను పరిశీలించాలంటూ ఓ నెటిజన్ చేసిన సూచనలకు కేటీఆర్ స్పందించారు. దేశంలోనే అతిపెద్ద అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మిస్తోన్నామని, కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయ‌ని చెప్పారు. కాగా 2022 అక్టోబర్‌లో మంత్రి కేటీ రామారావు కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌కు శంకుస్థాపన చేశారు. 

Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూప‌క‌ర్త‌, విగ్రహ ప్రత్యేకతలివే..

#Tags