Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ ఆవిష్కరించారు.
ఈ విగ్రహం గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. విగ్రహం వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నల వంటి పదార్థాలను తల్లి చేతిలో ఉంచి రూపకల్పన చేశారు, ఇవి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పంటలుగా సూచించబడతాయి.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారిలు, ప్రజలు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం, సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకర్షణీయంగా మారింది. విద్యుత్ కాంతులతో అందించిన ప్రదర్శన, సచివాలయ భవనంపై వెలుగులు అలరించాయి.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించానున్నారు.
Jaya Jaya He Telangana: రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’..
#Tags