AP హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా వై.లక్ష్మణరావు

సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా వై.లక్ష్మణరావు నియమితులయ్యారు. ఆయన ఇప్పటివరకు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌తో పాటు రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌గా కొనసాగుతున్నారు.
Y. Lakshmana Rao as Registrar General of AP High Court

ఇప్పుడు ఆయనను పూర్తిస్థాయి రిజిస్ట్రార్‌ జనరల్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నియమించారు. జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌గా తిరుపతి 10వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి వై. శ్రీనివాస శివరాం నియమితులయ్యారు. పరిపాలన రిజిస్ట్రార్‌గా ఆలపాటి గిరిధర్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన రిక్రూట్‌మెంట్‌ (నియామకాలు) రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. దానితో పాటు పరిపాలన రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని అదనపు బాధ్యతల నుంచి తప్పించి పూర్తిస్థాయి పరిపాలన రిజిస్ట్రార్‌గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 8వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి ఎస్‌.కమలాకర్‌రెడ్డి రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ నెలాఖరులోపు ఆయన గిరిధర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాలి. గుంటూరు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి వై.ఏడుకొండలు ఐటీ–సీపీసీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఐటీ – సీపీసీ రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గంధం సునీత నుంచి ఈ నెలాఖరు లోపు ఏడుకొండలు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు. 

Also read: World Health Organization: డబ్ల్యూహెచ్‌వోలో అమెరికా ప్రతినిధిగా డా.వివేక్‌ మూర్తి

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags