Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు.

కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబ‌ర్ 12వ తేదీ తుదిశ్వాస విడిచారు.  

సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12వ తేదీ మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయ‌న తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో భార్య‌. ఆయనకు ముగ్గురు సంతానం.
 
1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1975లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సీతారాం 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్ప‌టి నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు.

AG Noorani : న్యాయ కోవిదుడు ఏజీ నూరానీ కన్నుమూత

#Tags