Andhra Pradesh: పద్మశ్రీ అవార్డీ ఆశావాది ప్రకాశరావు కన్నుమూత

అరుదైన అవధాన ప్రక్రియలో అనంతపురం జిల్లా కీర్తిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన సీనియర్‌ సాహితీవేత్త, ప్రముఖ పద్యకవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు(78) కన్నుమూశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో కుమార్తె వద్ద  ఉంటున్న ఆయన.. ఫిబ్రవరి 17న గుండెపోటుకు గురై, తుదిశ్వాస విడిచారు. 2021 సంవత్సరానికిగాను సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ అవార్డునందుకున్న ఆశావాది ప్రకాశరావు.. వివిధ ప్రక్రియల్లో 65కుపైగా సాహితీ గ్రంథాలను రచించారు. ఆయన సాహిత్యంపై రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీలు పొందారు.

రాయలసీమలోని అనంతపురం జిల్లా, శింగనమల మండలం, పెరవలి గ్రామంలో జన్మించిన ఆశావాది ప్రకాశరావు.. బాల్యంలోనే ఆశువుగా కవిత్వం చెప్పి అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను మెప్పించారు. అనంతర కాలంలో ఉపాధ్యాయుడిగా, ప్రిన్సిపాల్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం పెనుకొండ ప్రాంతంలో పనిచేసి అక్కడే స్థిరపడ్డారు. వేలాదిమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాల్లో 170కి పైగా అవధానాలు చేశారు.

చ‌ద‌వండి: ఫెయిర్‌ప్రైస్‌ సీఈవోగా నియమితులైన భారత సంతతి వ్యక్తి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు    : డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు(78)
ఎక్కడ    : పెనుకొండ, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : గుండెపోటు కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags