NABARD: నాబార్డ్ ఏపీ సీజీఎంగా ఎంఆర్ గోపాల్

నాబార్డు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఎంఆర్ గోపాల్ జూలై 5వ తేదీ బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర విభజన తర్వాత, నాబార్డు విజయవాడలో అమరావతి సెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లోనే కొనసాగింది. ఉమ్మడి రాజధాని గడువు ఇటీవల ముగియడంతో, నాబార్డు విజయవాడలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది.

ఈ మార్పులో భాగంగా, ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయంలో సీజీఎంగా ఉన్న ఎంఆర్ గోపాల్‌ను నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయ సీజీఎంగా బదిలీ చేసింది. 

నాబార్డు వివ‌రాలు ఇవే..
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) 1982 జులై 12వ తేదీ స్థాపించబడింది. నాబార్డు చట్టం 1981 భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమనే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేత రూపొందించబడింది. ఇది గ్రామీణ సంఘాలకు రుణాలు ఇవ్వడం, సంపన్నమైన, స్థిరమైన జీవితాలను గడపేందుకు ప్రజలకు అవకాశాలను అందించడం దీని ముఖ్య కర్తవ్యం. వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధిలో విధాన రూపకల్పన, ప్రణాళిక కార్యకలాపాలు సహా అనేక బాధ్యతలను కలిగి ఉంది.

Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్హా

#Tags