First Woman President: మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన క్లాడియా షీన్‌బామ్!

మెక్సికో దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్ ఎన్నిక‌య్యారు.

13 కోట్ల జనాభా కలిగిన మెక్సికోలో దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. 
 
ఈమె ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, 2007లో నోబెల్‌ గ్రహీత, మెక్సికో సిటీ మాజీ మేయర్‌. షీన్‌బామ్‌ తొలి అధ్యక్షురాలే కాదు.. యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ అబ్రేడర్‌కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యర్థిగా షేన్‌బామ్‌ బరిలో దిగారు. 

కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్‌ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్‌ సదుపాయం వంటివాటితో లోపెజ్‌ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు.

First Judge in California: అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. ఈమె ఎవ‌రో తెలుసా..

డ్రగ్‌ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్‌ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్‌ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానన్నారు.

#Tags