Leo Varadkar: భారత సంతతికి చెందిన ఐర్లాండ్‌ ప్రధాని లియో వరాద్కర్ రాజీనామా

భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరాద్కర్ (45) తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.

అలాగే పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏడేళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ, ఆ పదవికి సరిపోయే వ్యక్తిని అనిపించడం లేదంటూ ఆయన తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. కొత్తగా ఎన్నుకునే నాయకుడు తన కంటే ఉన్నతంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

వరాద్కర్‌ తండ్రిది భారత్‌లోని ముంబయి కాగా, తల్లి ఐర్లాండ్‌ దేశస్థురాలు. 2017 నుంచి ఫైన్‌ గాయెల్‌ పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు. 38 ఏళ్ల వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వరాద్కర్‌ దేశంలోనే తొలి ‘గే’ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.

Vinay Kumar: రష్యాకు కొత్త రాయబారిని నియమించిన కేంద్రం.. ఆయ‌న ఎవ‌రంటే..

#Tags