Satish Kumar: రైల్వే బోర్డు చైర్మన్‌గా నియమితులైన‌ సతీష్‌ కుమార్‌

ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్‌) అధికారి సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్‌-సీఈఓగా నియమితుల‌య్యారు.

ఈ పదవిని చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఈయనే. ప్రస్తుతం ఆయన రైల్వే బోర్డు మెంబర్‌(ట్రాక్షన్‌-రోలింగ్‌ స్టాక్‌)గా ఉన్నారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న జయ వర్మ సిన్హా ఈ నెల 31వ తేదీ పదవీ విరమణ చేయ‌నున్నారు. అనంతరం సతీష్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

సతీష్ కుమార్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (IRSME) యొక్క 1986 బ్యాచ్‌కు చెందినవారు. ఆయనకు రైల్వే రంగంలో 34 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

మాలవ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.  ఆపరేషన్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉన్నారు.  ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి సైబర్ లా పూర్తి చేశారు.

New Chief Secretary: అరుదైన రికార్డు.. భర్త తర్వాత భార్య ప్రధాన కార్యదర్శులుగా..

#Tags