UN Resident Coordinator: ఇండోనేషియాలో యుఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా నియమితులైన గీతా సబర్వాల్

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్‌ను ఇండోనేషియాకు కొత్త యుఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా నియమించారు.

సబర్వాల్ ఇటీవలే తన పదవిని స్వీకరించారు. ఆమెకు అభివృద్ధి రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. వాతావరణ మార్పు, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇవ్వడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడానికి డిజిటల్ సాంకేతికత, డేటాను ఉపయోగించడంలో ఆమె నైపుణ్యం కలిగి ఉన్నారు.

ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ పాత్ర..
➤ ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ దేశ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థకు అత్యున్నత స్థాయి ప్రతినిధి.
➤ రెసిడెంట్ కోఆర్డినేటర్లు ఐక్యరాజ్యసమితి దేశ బృందాలకు నాయకత్వం వహిస్తారు.
➤ సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేయడంలో దేశాలకు ఐక్యరాజ్యసమితి మద్దతును సమన్వయం చేస్తారు.

Muslim University: అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

#Tags