Anshuman Gaekwad: మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత
గత కొంతకాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన జూలై 31వ తేదీ తుదిశ్వాస విడిచారు.
గైక్వాడ్ క్రికెట్ జీవితం..
1974-87 మధ్య కాలంలో భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడిన గైక్వాడ్, 2,254 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నారు. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. రెండుసార్లు టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేశారు. అంతకు ముందు నైంటీస్‌లో ఆయన జాతీయ టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ పనిచేశారు.
గైక్వాడ్ కేన్సర్ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆదుకోవాలని బీసీసీఐకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మధ్యే విన్నవించారు. దీనికి స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ.కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈలోపే ఆయన కన్నుమూశారు.