Forbes Richest Billionaires: ప్రపంచ కుబేరుల జాబితాలో మన తెలుగువాళ్లు, వీళ్ల ఆస్తుల లెక్కలు చూస్తే..

ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల్లో మొదటి పది మందిలో రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. మరోసారి భారత్‌లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్‌ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు.

ముకేశ్‌ అంబానీ తర్వాత ఆయనే..
2023లో ఆయన సంపద 83.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్‌ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 47.2 బిలియన్‌ డాలర్ల నుంచి 84 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ సహవ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌  36.9 బిలియన్‌ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు.

చదవండి: Forbes Released World Richest Billionaires: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వీళ్లే, టాప్‌-10లో ముఖేష్‌ అంబానీ

జిందాల్‌ గ్రూప్‌ సావిత్రి జిందాల్‌-కుటుంబం (33.5 బి.డాలర్లు) 46వ స్థానంలో, సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వి (26.7 బి.డాలర్లు) 69వ స్థానంలో నిలిచారు. సైరస్‌ పూనావాలా (21.3 బి.డాలర్లు) 90వ స్థానం, కుషాల్‌ పాల్‌ సింగ్‌ (20.9 బి.డాలర్లు) 92వ స్థానం, కుమార్‌ బిర్లా (19.7 బి.డాలర్లు) 98వ స్థానం దక్కించుకున్నారు.

 

తెలుగు రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్‌లో చోటు సంపాదించుకున్న వాళ్లు..

  • మురళి దివి, కుంటుబం 6.2 బిలియన్‌ డాలర్ల సంపదతో(రూ.51వేలకోట్లు) 469 ర్యాంకులో నిలిచారు.
  • ప్రతాప్‌ సి రెడ్డి 3 బిలియన్‌ డాలర్లతో(రూ.26వేలకోట్లు) 1104 ర్యాంకు
  • జీఎం రావు 2.9 బిలియన్‌ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు
  • పీవీ రామ్‌ ప్రసాద్‌రెడ్డి 2.9 బిలియన్‌ డాలర్లతో(రూ.25వేలకోట్లు) 1143 ర్యాంకు
  • జూపల్లి రామేశ్వర్‌రావు 2.3 బిలియన్‌ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు
  • పీపీ రెడ్డి 2.3 బిలియన్‌ డాలర్లతో(రూ.19వేలకోట్లు) 1438 ర్యాంకు
  • పీవీ కృష్ణారెడ్డి 2.2 బిలియన్‌ డాలర్లతో(రూ.18వేలకోట్లు) 1496 ర్యాంకు
  • ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్‌ డాలర్లతో(రూ.16వేలకోట్లు) 1623 ర్యాంకు
  • కె.సతీశ్‌రెడ్డి 1.8 బిలియన్‌ డాలర్లతో(రూ.15వేలకోట్లు) 1764 ర్యాంకు
  • జి.వి.ప్రసాద్‌ 1.5 బిలియన్‌ డాలర్లతో(రూ.12వేలకోట్లు) 2046 ర్యాంకు

#Tags