Advocate General of AP: ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితుల‌య్యారు.

దీనికి సంబంధించిన‌ నియామక ఉత్తర్వులను జూన్ 18వ తేదీ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

రెండోసారి ఏజీగా దమ్మాలపాటి 
ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులు కావడం ఇది రెండోసారి. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన ఏజీగా సేవలందించారు. 2014లో చంద్ర­బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప­ట్టిన వెంటనే సీనియర్‌ న్యాయవాది పి.వేణుగోపాల్‌ అడ్వొకేట్‌ జనరల్ కాగా, దమ్మాలపాటి అదనపు ఏజీగా నియమితులయ్యారు. 2016లో వేణుగోపాల్‌ ఏజీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 2016 మే 28వ తేదీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయేంత వరకు ఏజీగా కొనసాగారు. 

AP Assembly Speaker: ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!

➤ కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించిన దమ్మాలపాటి 1991లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
➤ 1991లోనే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
➤ రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, పన్నులకు సంబంధించిన కేసుల్లో నిపుణుడిగా పేరు సంపాదించారు.
➤ రైల్వే, కేంద్ర ప్రభుత్వం, ఆదాయపు పన్ను శాఖ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.
➤ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు, పలు కార్పొరేట్‌ సంస్థలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా సేవలందించారు. 

Syamala Rao: టీటీడీ కొత్త‌ ఈవోగా నియమితులైన‌ శ్యామ‌ల‌రావు

#Tags