Andhra Pradesh : ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు నియమాకం.. అలాగే అలీ, పోసాని కృష్ణ మురళీకి కూడా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Kommineni Srinivasa Rao

అలాగే కేబినెట్‌ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం న‌వంబ‌ర్ 3వ తేదీన (గురువారం) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావు వివిధ హోదాల్లో.. 


కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఈనాడు పత్రికలో వివిధ హోదాల్లో దాదాపు 24 సంవత్సరాల పాటు పని చేశారు. అలాగే 2002లో ఆంధ్రజ్యోతి దినపత్రిక పునఃప్రారంభం అయినపుడు బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. 2007 నుంచి ఎన్టీవీ ఛానల్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు దాదాపు ఎనిమిదేళ్ల పాటు పని చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఎన్టీవీ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ‘సాక్షి’ ఛానల్‌లో చేరారు. ప్రస్తుతం కొమ్మినేని సాక్షి టీవీలో పొలిటికల్‌ డిబేట్లకు వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు.

అలీ, పోసాని కృష్ణ మురళీకి కూడా.. 

ఇటీవలే నటుడు అలీని ఏపీ ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పోసాని కృష్ణ మురళీ ఏపీ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.

#Tags