ABC New Chairman: ఏబీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్‌ కె.స్వామి

2023–24 సంవత్సరానికి గాను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌(ఏబీసీ) చైర్మన్‌గా ఆర్‌.కె.స్వామి హంస గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ శ్రీనివాసన్‌ కె.స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ABC New Chairman

ఆయన ప్రస్తుతం ఆసియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అడ్వర్‌ టైజింగ్‌ అసోసియేషన్స్‌ చైర్మన్‌గా పని చేస్తున్నారు. గతంలో ఇంటర్నేషనల్‌ అడ్వర్‌టైజింగ్‌ అసోసియేషన్‌(ఐఏఏ)–ఇండియా చాప్టర్‌ ప్రెసిడెంట్‌/చైర్మన్‌గా సేవలందించారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆసియన్‌ అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీ అసోసియేషన్స్, అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేసన్, మద్రాస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, మద్రాస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గాను పనిచేశారు.

Master Card India: మాస్టర్ కార్డ్ ఇండియా ఛైర్మన్‌గా ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌

శ్రీనివాసన్‌ కె.స్వామిని అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ డిప్యూటీ చైర్మన్‌ గారియాద్‌ మాథ్యూ, గౌరవ కార్యదర్శిగా మోహిత్‌ జైన్, గౌరవ కోశాధికారిగా విక్రమ్‌ సఖూజా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

Dr. Sheikh Chandbasha: డాక్టర్‌ షేక్‌ చాంద్‌బాషాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం

#Tags