Dr. Sheikh Chandbasha: డాక్టర్ షేక్ చాంద్‌బాషాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
Sakshi Education
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ విభాగంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేస్తున్న డాక్టర్ షేక్ చాంద్‌బాషాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించినట్లు బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. శ్రీనివాసులు బుధవారం తెలిపారు.
విభాగాధిపతి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆ్రస్టేలియా, మలేషియా, ఇరాక్ వంటి ప్రపంచంలోని ప్రముఖ దేశాలకు చెందిన యాంజియోథెరపీ శాస్త్రవేత్తల సరసన భారతదేశం నుంచి మొట్టమొదటి పరిశోధకుడిగా డాక్టర్ షేక్‌చాంద్ బాషా ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. ప్రముఖ బహుళ క్రమశిక్షణ అంతర్జాతీయ జర్నల్‌లో ఒకదానికి అసోసియేట్ ఎడిటర్‌గా ఎంపిక చేయబడ్డారని తెలిపారు. భారతదేశం నుంచి కేవలం డాక్టర్ చాంద్ బాషా మాత్రమే ఎంపిక చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని అన్నారు. న్యూరో డెజెనరేటివ్ డిజార్డర్స్‌లో డాక్టర్ చాంద్ బాషా చేసిన కృషిని గుర్తించి, జర్నల్‌కు అసోసియేట్ ఎడిటర్‌గా ఆహ్వానించారని తెలిపారు.
Tejeswara Rao in Guinness Book:గిన్నిస్ బుక్’లో తేజేశ్వరరావుకు చోటు
Published date : 14 Sep 2023 03:13PM