Women Reservation Bill 2023 : చారిత్రాత్మక కీలక నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. ముఖ్యమైన అంశాలు ఇవే...
పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేబినెట్ చారిత్రాత్మక ప్రకటన చేసింది.
☛ GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవరు..?
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో..
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించబడతాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ రిజర్వ్‌డ్ సీట్లలో మార్పులు చేయాలని కేబినెట్ ప్రతిపాదించింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్లకు సబ్-రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం, లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా, అందులో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా, అందులో 24 మంది మహిళా సభ్యులు.
ఈసారి అంతా..
మహిళా రిజర్వేషన్ బిల్లు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకో లేదు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అంతా సజావుగా సాగితే ఈ సమావేశాల్లోనే బిల్లుకు మోక్షం కలిగే అవకాశం ఉంది.
☛ India's Name Changing To Bharat : భారత్ వెనుక ఉన్న రహస్యం ఇదేనా..?
మొట్టమొదటిసారిగా..
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొట్టమొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో కూడా బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభలో ఆమోదం పొందలేదు.
2010లో ఎట్టకేలకు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో మాత్రం ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్ బిల్లుపై నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.
☛ Happiest State in India : భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదే..! వీళ్ల సంతోషానికి కారణం..