Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ వచ్చేసింది.. ఇందులో ఉండే సౌకర్యాలు ఇవే..

వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ నమూనాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సెప్టెంబ‌ర్ 1వ తేదీ ఆవిష్కరించారు.

బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్‌ఎల్‌) తయారీ కర్మాగారంలో వీటిని ప్రారంభించారు. బీఈఎమ్‌ఎల్‌లో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 

'ప‌ది రోజుల‌పాటు టెస్టులు, ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాక బీఈఎంఎల్‌లోనే మ‌రిన్ని ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. వందేభార‌త్ స్లీప‌ర్ కోచ్‌లు మూడు నెల‌ల్లో పూర్తిస్థాయిలో ప‌ట్టాల‌పైకి వ‌స్తాయి. కోచ్‌ల ఉత్ప‌త్తి ప్ర‌క్రియ మొద‌ల‌య్యాక నెల‌కు రెండు మూడు చొప్పున రైళ్లు ప‌ట్టాల‌పైకి వ‌స్తుంది. 16 బోగీలుండే వందేభార‌త్ స్లీప‌ర్ రైళ్ల‌ను 800 నుంచి 1,200 కిలోమీట‌ర్ల దూరంలోని రాత్రి వేళ ప్ర‌యాణాల‌కు ఉద్దేశించాం. వీటి చార్జీలు రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌తో స‌మానంగా ఉంటుంది.' అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

Vande Bharat Trains: మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోదీ..

స్లీపర్‌ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే..
➤ కోచ్‌లలో రీడింగ్‌ ల్యాంప్స్‌, ఛార్జింగ్‌ అవుట్‌లెట్‌లు, స్నాక్‌ టేబుల్, మొబైల్‌, మ్యాగజైన్‌ హోల్టర్స్‌ ఉంటాయి.
➤ రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్‌’ వ్యవస్థ ఉంటుంది.
➤ అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.
➤ కోచ్‌లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
➤ ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో అమర్చారు.
➤ 16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో స్లీపర్‌ ట్రైన్‌ రానుంది. వీటిలో పదకొండు 3టైర్‌ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్‌ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌(24 బెర్త్‌లు) ఉంటాయి. 

Railway Projects: రూ.6,456 కోట్ల.. రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

#Tags