Minimum Support Price: రబీ పంటలకు కనీస మద్దతు దర పెంపు

రబీ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) సెప్టెంబర్‌ 8న సమాశమై, పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై నిర్ణయం తీసుకుంది. క్వింటాల్‌కు గోధుమలకు రూ.40, ఆవాలకు రూ.400 చొప్పున పెంచారు. ఈ పెంపుతో కనీస మద్దతు ధర క్వింటాల్‌ గోధుమలకు రూ.2,015, ఆవాలకు రూ.5,050కు చేరుకోనుంది.

కనీస మద్దతు ధర(క్వింటాల్‌కు రూ.లలో)
పంట     2020–21 2021–22
గోధుమ     1,975 2,015
ఆవాలు     4,650     5,050
బార్లీ 1,600 1,635 
పప్పు ధాన్యాలు 5,100     5,230 
మసూర్‌     5,100     5,500
పొద్దుతిరుగుడు     5,327 5,441


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలకు కనీస మద్దతు దర పెంపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 8
ఎవరు    : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ)
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు   : రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా...
 

#Tags