Supreme Court : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్‌ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఆగస్ట్‌ 1న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై∙చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యు­ల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో తీర్పునిచ్చింది.

Governors Meeting: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లే సంధానకర్తలు..

రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం–ఎస్సీలు సజాతీయులు కాబట్టి వర్గీకరణ చేయడానికి వీలు లేదంటూ ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం’ కేసులో 2004లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఈ సందర్భంగా కొట్టివేసింది.

#Tags