State of World Population Report: షాకింగ్‌.. భారతదేశ జనాభా 144.17 కోట్లు!

న్యూఢిల్లీ: భారతదేశ జనాభా 144.17 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌(యూఎన్‌ఎఫ్‌పీఏ) అంచనా వేసింది. ఈ మేరకు స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌–2024 నివేదికను విడుదల చేసింది. ఇండియాలోని మొత్త జనాభాలో 24 శాతం మంది 14 ఏళ్లలోపువారే ఉన్నారని వెల్లడించింది.

10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17 శాతం, 10 నుంచి 24 ఏళ్లలోపువారు 26 శాతం, 15 నుంచి 64 ఏళ్లలోపు వయసున్నవారు 68 శాతం మంది ఉన్నారని వివరించింది. 65 ఏళ్లు దాటినవారు దేశ జనాభాలో 7 శాతం ఉన్నట్లు తెలిపింది.

ఇండియాలో పురుషుల్లో సగటు జీవన కాలం 71 ఏళ్లు కాగా, మహిళల్లో 74 ఏళ్లుగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో జనాభా మరో 77 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని తెలియజేసింది. భారత్‌ పొరుగుదేశమైన చైనాలో జనాభా 142.5 కోట్లకు చేరినట్లు పేర్కొంది.

#Tags