Social Media Active Users: సోషల్‌ మీడియా యాక్టివ్‌ యూజర్లు 500 కోట్లు

సోషల్‌ మీడియా వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
Social Media

ఇంటర్నెట్‌ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంటే ప్రపంచ జనాభాలో 64% మంది సామాజిక మాధ్యమాల్లో అత్యధికంగా కాలం గడుపుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే వినియోగదారులు 3.7% పెరిగినట్టు డిజిటల్‌ అడ్వయిజరీ సంస్థ కెపియోస్‌ అధ్యయనంలో వెల్లడైంది.

☛☛ Open-Source AI: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ

► తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో సోషల్‌ మీడియా యూజర్ల సంఖ్య తక్కువగా ఉంది. ప్రతీ 11 మందిలో ఒక్కరికే సోషల్‌ మీడియాలో ఖాతాలున్నాయి.

► భారత్‌లో ప్రతీ ముగ్గురిలో ఒకరు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నారు

► రోజుకి సగటున 2 గంటల 26 నిమిషాలు సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు

► బ్రెజిల్‌ వాసులు అత్యధికంగా సగటున 3 గంటల 49 నిమిషాలు సోషల్‌ మీడియాలో ఉంటే, జపాన్‌ వాసులు అత్యంత తక్కువగా గంటలోపు మాత్రమే సోషల్‌ మీడియాని చూస్తున్నారు.

► సోషల్‌ మీడియా యూజర్లకి దాదాపుగా ఏడు యాప్స్‌లో ఖాతాలుంటు న్నాయి. వీటిలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ ప్రధానమైనవి.

☛☛ Daily Current Affairs in Telugu: 21 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags