SHe-Box Portal : మహిళల భద్రత కోసం షీ–బాక్స్‌ పోర్టల్‌.. స‌కాలంలో ప‌రిష్కారం..

పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ–బాక్స్‌ (SHe-Box) పోర్టల్‌ను ప్రారంభించింది.

పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ–బాక్స్‌ (SHe-Box) పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఆగస్టు 29న ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

Research Data of Chandrayaan 3 : ఇస్రో అందుబాటులోకి చంద్రయాన్‌–3 పరిశోధన డేటా

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇంటర్నల్‌ కమిటీలు, స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుందని ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. యువ‌తులు, మ‌హిళ‌లు ఈ పోర్టల్‌ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసే వీలుంటుంది. దీంతో దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదో తెలుసుకోవచ్చు, సకాలంలో తమ సమస్యల పరిష్కారం జరిగేలా చేయవచ్చు.

#Tags