H3N2 Influenza: కాన్సూర్‌లో భారీగా H3N2 వైరస్ కేసులు

హెచ్‌3ఎన్‌2 అనే కొత్త రకం వైరస్‌ కారణంగా దగ్గు, జలుబు, జ్వరంతో ప్రజలు బెంబెలెత్తున్నారు.

అచ్చం కోవిడ్ లక్షణాలు కలిగిన ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు గత కొంత కాలంగా విపరీతంగా పెరుగుతున్నాయి. కాగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చాలా మంది ఈ వైరస్ బారిన ప‌డుతున్నారు. దీంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కట్ట‌డంతో అత్యవసర వార్డులు కిక్కిరిపోతున్నాయి. కాన్పూర్‌ నగరంలోని హల్లెట్‌ ప్రభుత్వ ఆసుపత్రికి  జ్వరం, నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో రోగుల‌ను ఎమర్జెన్సీ వార్డుల నుంచి ఇతర వార్డులకు తరలిస్తున్నారు. 

ఈ పరిస్థితిపై వైద్యాధికారులు మాట్లాడుతూ సాధారణంగా ఏటా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి కేసులు చూస్తుంటాం. కానీ, ఈ సారి రోగుల‌ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది ఆసుప‌త్రిలో చేరారు. వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నార‌ని తెలిపారు. 

H3N2 Influenza: కోవిడ్‌ తరహాలో విస్తరిస్తున్న హెచ్‌3ఎన్‌2.. విపరీతంగా పెరుగుతున్న కేసులు

#Tags