Pan Masala: పాన్‌మసాలా ప్యాకెట్‌పై ఎంత శాతం హెచ్చరిక ముద్ర ఉండాలి?

పాన్‌ మసాలా నమలడం ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికను ఉత్పత్తి సంస్థలు ప్యాకెట్‌పై 50 శాతం మేర ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాలు (లేబులింగ్, డిస్‌ప్లే) సవరణ నిబంధనలు, 2021 గెజిట్‌ నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 7న కేంద్రం విడుదల చేసింది.

బ్రెడ్లకు సంబంధించి సదరు పదార్థాలు ఎంత శాతం ఉండాలనేది గెజిట్‌లో పొందుపరిచింది. పూర్తి గోధుమ బ్రెడ్‌లో గోధుమలు 75 శాతం, మల్టీగ్రైన్‌ బ్రెడ్‌లో ఆయా పదార్థాలు 20 శాతం, మిల్క్‌ బ్రెడ్‌లో పాల ఘనపదార్థం ఆరు శాతం, హనీబ్రెడ్‌లో తేనె 5 శాతం, చీజ్‌ బ్రెడ్‌లో వెన్న 10 శాతం, ఓట్‌మీల్‌ బ్రెడ్‌లో ఓట్స్‌ 15 శాతం, ప్రోటీన్‌ బ్రెడ్‌లో 20 శాతం ప్రోటీన్లు ఉండాలంటూ... ఆయా పదార్థాల శాతం గెజిట్‌లో పొందుపరిచింది.

ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా ఎవరు ఉన్నారు?
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రి నంద కుమార్‌ బఘేల్‌ అరెస్టయ్యారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాయ్‌పూర్‌ పోలీసులు ఢిల్లీలో నందకుమార్‌ను అరెస్టు చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పాన్‌ మసాలా నమలడం ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికను ఉత్పత్తి సంస్థలు ప్యాకెట్‌పై 50 శాతం మేర ప్రచురించాలి
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ    : దేశ వ్యాప్తంగా...
ఎందుకు  : పాన్‌ మసాలా నమలడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా...
 

#Tags