Vande Bharat Trains: ఆరు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబ‌ర్ 15వ తేదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్‌ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆరు నూతన వందేభారత్‌ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.

ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్‌బాద్‌లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్‌కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.

మొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Health Insurance: 70 ఏళ్లు పైబడిన వారందరికీ.. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా

#Tags