High Court : బిహార్‌లో 65 శాతం కోటా రద్దు చేసిన హైకోర్టు!

ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తెచ్చిన చట్టాన్ని పాట్నా హైకోర్టు జూన్‌ 20న కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న న్యాయస్థానం.. 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్ర‌న్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది నవంబర్‌లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం చేసిన సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వ్‌ చేయగా.. తాజాగా రిజర్వేషన్లను రద్దు చేస్తూ తుది తీర్పునిచ్చింది.

Highest Railway Bridge : ఎత్తయిన రైలు వంతెనపై ట్రయల్‌ రన్ విజ‌య‌వంతం..

#Tags