Odisha Election Results: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ
గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో నవీన్ పట్నియక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి.
ఈ పార్టీలు ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచాయంటే..
బీజేపీ 78
బీజేడీ 51
కాంగ్రెస్ 14
సీపీఐ(ఎం) 1
స్వతంత్రులు 3
సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్
2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పట్నాయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.