Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటో తెలుసా... ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారంటే... ఒక్క గోవాలో మాత్రం

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంటే.. దేశమంత‌టికీ ఒక్కటే పౌర చట్టం. ప్రస్తుతం భారతావని ఒకే దేశంగా ఉన్నా ఒకే పౌరచట్టం లేదు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత.. తదితర వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్‌ క్రిస్టియన్లు, పార్సీలకు తమతమ మత చట్టాలు వర్తిస్తున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయి.. అందరికీ ఒకే చట్టం అమలవుతుంది.
ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటో తెలుసా... ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారంటే... ఒక్క గోవాలో మాత్రం

ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగంలోనూ నిర్దేశించారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో యూసీసీ ఒకటి. రాజ్యాంగంలోని 44 ఆర్టికల్‌- భారత్‌లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించటానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టం చేస్తోంది. స్వాతంత్య్రానంతరం అప్పుడప్పుడూ యూసీసీ చర్చల్లోకి వచ్చినా అమలు దిశగా అడుగులు పడలేదు. రెండో లా కమిషన్‌ ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే యూసీసీ అనేది వివిధ చట్టాల్లోని వివక్షను తొలగించి జాతి సమగ్రతకు దోహదం చేస్తుందని, ప్రభుత్వమే చొరవ తీసుకొని తన బాధ్యతను నిర్వర్తించాల‌ని గ‌తంలో సుప్రీం అభిప్రాయ‌ప‌డింది.

IAS Success Story: 16 ఏళ్ల‌కే వినికిడి శ‌క్తి కోల్పోయా... కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే ఐఏఎస్ సాధించానిలా...

రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధిలో.... 
యూసీసీని ‘ప్రభుత్వం’ అమలు చేయాలని రాజ్యాంగం సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-12 ప్రకారం ప్రభుత్వం అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఉమ్మడి పౌరస్మృతి అనేది ముఖ్యంగా వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వంలాంటి వ్యక్తిగత అంశాలకు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఉంది. 

IFS Success Story: క‌రెంట్ అఫైర్స్ కోసం వీటినే ఫాలో అయ్యా... యూట్యాబ్ సాయంతో కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంకు సాధించానిలా...

పార్లమెంటు చేసిన పర్సనల్‌ చట్టాలకు రాష్ట్రాలు సవరణలు చేయొచ్చు. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలపై చట్టం చేస్తే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రాజ్యాంగం నిర్దేశించిన నేపథ్యంలో పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఈ విషయంలో భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపాక, లా కమిషన్‌ నివేదిక కూడా వచ్చాక నిర్ణయం తీసుకుంటామని మోదీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. 

వ్య‌తిరేకించేది ఎందుకంటే...
ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వస్తే మతపరమైన పర్సనల్‌ చట్టాలు రద్దవుతాయి. వివిధ మతాలను అనుసరించే, ఆయా మతాల చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోయినట్లవుతుందనేది వ్యతిరేకించేవారి వాదన. యూసీసీ అమలులోకి తెస్తే భారతీయ సమాజంలో వైవిధ్యం దెబ్బతింటుందని, మతస్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, మైనారిటీలు అభద్రతకు లోనవుతారన్నది వారి ఆందోళన.

☛  NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్ల‌కే పెళ్లి... 20 ఏళ్ల‌కు పాప... ఐదో ప్ర‌య‌త్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేష‌న‌ల్‌ స్టోరీ

వేరే చ‌ట్టాలు ఎందుకు....
పౌరస్మృతితో మతాలకు అతీతంగా భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన న్యాయం లభిస్తుందన్నది చ‌ట్టాన్ని స‌మ‌ర్థించేవారి వాద‌న‌. ఒకే దేశంలో ఉంటున్నప్పుడు వేరే చ‌ట్టాలు ఎందుకు అని వారి ప్ర‌శ్న‌.? దీని వల్ల పర్సనల్‌ చట్టాల్లోని వివక్ష పోయి.. స్త్రీ-పురుష సమానత్వం కూడా సాధ్యమౌతుందనేది వారి భావ‌న‌.

కేవలం రెండు నెలల్లో...142 మరణాలు... అక్క‌డ ఏం జ‌రుగుతోంది..?

ఒక్క గోవాలోనే అమలులో... 
స్వాతంత్య్రానికి ముందు గోవా పోర్చుగీసు వలసపాలనలో ఉండేది. 1867లో పోర్చుగల్‌ పోర్చుగీసు సివిల్‌కోడ్‌ను తెచ్చింది. అప్ప‌టినుంచి పోర్చుగీసు సివిల్‌కోడ్ గోవాలో కొనసాగుతోంది. అక్క‌డ‌ అన్ని మతాలకూ ఒకే చట్టం. అయితే... హిందూ మగవారికి మాత్రం ఒక మినహాయింపు ఉంది. 21 సంవత్సరాల వయసుకల్లా భార్య పిల్లల్ని కనకున్నా, 30కల్లా మగపిల్లాడికి జన్మనివ్వకున్నా హిందూ భర్త మరో వివాహం చేసుకోవచ్చు. అయితే 1910 నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ చట్టప్రకారం మినహాయింపును వినియోగించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

#Tags